Title 2మీకు డయాబెటీస్ ఉందా..? అయితే ఈ ఆహారాలను తప్పక తినండి..

బీట్‏రూట్: షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసేందుకు డయాబెటీస్ ఉన్నవారు బీట్‏రూట్‏లను తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్స్ వంటి పోషకాలను పుష్కలంగా కలిగిన బీట్‏రూట్‏ డయాబెటీస్ నియంత్రణలో సహయపడుతాయి

నేరేడు పండ్లు: మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవెల్స్‌ను తగ్గించుకునేందుకు నేరేడు పండ్లు ఉత్తమ ఆహారం. నేరేడులోని పోషకాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి.

మెంతి గింజలు: మెంతి గింజలు అలాగే మెంతి ఆకులు, రెండూ షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయి.

ఫైబర్ ఎక్కువగా ఉన్నందున ఇవి జీర్ణ సమస్యలను నివారంచి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.